అనంతపురము, జూన్19:
– ఈ నెల జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ సి.విష్ణు చరణ్ అధికారులను ఆదేశించారు.
– *అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సదరు కార్యక్రమాలను జిల్లాలోని జిల్లా కేంద్రం, మున్సిపాలిటీ, మండల, అన్ని సచివాలయాల పరిధిలో నిర్వహించే యోగాంధ్ర 2026 కార్యక్రమాలు జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు పక్కాగా నిర్వహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదేశించారు. యోగా వేదికల ఏర్పాట్లు, సిటిజన్, వేదికల మ్యాపింగ్, కార్యక్రమ నిర్వహణ సంబంధిత ఫొటోలను యాప్ నందు సత్వరమే ఫొటోల అప్లోడింగ్ తదితర అంశాలను నిబంధనల మేరకు చేపట్టాలని అన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత వివరాలు నమోదు చేయడం కాకుండా, కార్యక్రమం ప్రారంభమైన వెంటనే అప్రమత్తం కావాలన్నారు. ఉదయం 7:00 గంటలకు ప్రారంభించి 7.45 గం.లకు ముగిసేలా చర్యలు తీసుకోవాలని, యోగా కార్యక్రమం
