జూలై 1న గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన..
– : రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మరియు ఎస్పీ పీ.జగదీష్
అనంతపురము, జూన్ 19 :
– జూలై 1న గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అనంతపురములోని ‘జ్ఞాన సీమ’ ప్రాంగణంలో నిర్వహించనున్న విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (CUAP) అనంతపురము ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్.ఎ. కోరి గారితో కలిసి, సెంట్రల్ యూనివర్సిటీని శుక్రవారం సాయంత్రం సందర్శించి ఏర్పాట్లపై స్థల పరిశీలన చేసి అధికారులతో సమీక్షించి పలు అంశాలపై జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ దిశా నిర్దేశం చేశారు.
– హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ ఐదు హెలిప్యాడ్ ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, జియో కోఆర్డినేట్లు సత్వరమే పంపాలని జిల్లా కలెక్టర్ సూచించారు. స్నాతకోత్సవం జరిగే ప్రాంతాన్ని పరిశీలించి పలు అంశాలపై సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ మరియు తదితర అధికారులతో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ చర్చించి పలు సూచనలు చేశారు.
– యూనివర్సిటీ రహదారి, సమీప ప్రదేశంలోని అంశాలపై చర్చించారు. యూనివర్సిటీ అవసరాలకు సరిపడా నీరు సరఫరా కొరకు ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులు ప్రత్యామ్నాయ మార్గంగా బోర్ వెల్ డ్రిల్లింగ్ కొరకు ప్రతిపాదనలు సత్వరమే సిద్ధం చేయాలని అన్నారు.
– ఈ కార్యక్రమంలో అనంతపురము ఇంచార్జి ఆర్డీఓ రామ్మోహన్, రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు, ఏపీ ఎస్పీడీసిఎల్, ఆర్.అండ్.బి ఎస్ఈ మురళీకృష్ణ, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ కె.శ్రీనివాసులు, కలెక్టరేట్ కో ఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ యుగేశ్వరి దేవి బుక్కరాయసముద్రం తహసీల్దార్ శ్రీధర్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
