Latest Posts

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే వివరాలు అన్ని స్వర్ణ గ్రామం & స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రదర్శన: జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే వివరాలు అన్ని స్వర్ణ గ్రామం & స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రదర్శన: జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్

– ఇటీవల జరిగిన యునిఫైడ్ ఫ్యామిలీ సర్వే (యుఎఫ్ఎన్) సమాచారాన్ని కుటుంబాల వారిగా జిల్లాలోని అన్ని స్వర్ణ గ్రామం & స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రదర్శించడం జరిగిందని గౌరవ జిల్లా కలెక్టరు, అనంతపురము వారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

– ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని మండలాలలో మరియు అన్ని మునిసిపాలిటీలలోని అన్ని స్వర్ణ గ్రామం & స్వర్ణ వార్డులలో జనాభా వివరాలు, సామాజిక-ఆర్ధిక స్థితి, విద్య, ఉపాధి, గృహ పరిస్థితులు, ప్రాథమిక సౌకర్యాల లభ్యత, ఇంటి స్థితిగతులు మరియు ఇతర సంక్షేమ అంశాలకు సంబంధించిన గృహ, పౌరస్థాయి సమాచారం సేకరణ నిమిత్తం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరిగిందని తెలిపారు. సదరు సర్వే సమాచారం మొత్తాన్ని అన్ని స్వర్ణ గ్రామం & స్వర్ణ వార్డు కార్యాలయాలలో గురువారం నుంచి ప్రదర్శించడం జరిగింది అని, కావున ప్రజలు ఈ సమాచారాన్ని పరిశీలించి తప్పు ఒప్పులు సరిచూసుకోవాలని కోరారు. 19వ తేదీన శుక్రవారం అన్ని స్వర్ణ గ్రామం & స్వర్ణ వార్డు కార్యాలయాల్లో సర్వే సమాచారంపై గ్రామ/వార్డు సభలు నిర్వహించమని ఆదేశాలు ఇవ్వడమైనదని తెలిపారు. ఈ యునిఫైడ్ ఫ్యామిలీ సర్వే సమాచారంలో తప్పులు ఉంటే 19.06.2026 వ తేదీ నుండి 24.06.2026 వ తేదీ వరకు సంబందిత స్వర్ణ గ్రామం & స్వర్ణ వార్డు కార్యాలయాల్లో అర్జీలు సమర్పించాలన్నారు. సదరు అర్జీలను 27వ తేది వరకు పరిశీలించి వాటిని సరిచేయడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వారు ఆ ప్రకటనలో తెలిపారు.

Posted Under AP
Editor