అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలం గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు గరుడ వాహనంపై అలంకారమై భక్తులకు దర్శనమిచ్చారు.
మంగళ వాయిద్యాల మధ్య ఉత్సవమూర్తిని గరుడ వాహనంపై మాడ వీధులు చుట్టూ ఊరేగింపుగా తీసుకువెళ్లగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. స్వామివారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివవచ్చారు.
గరుడ వాహనం వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. గరుడుడు విష్ణుమూర్తి వాహనంగా ప్రసిద్ధి చెందగా, ఈ వాహన సేవను దర్శించడం ద్వారా పాప విమోచనం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. గరుడ వాహనము అనంతరం శ్రీ స్వామి వారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించడమైనది.
ఈ కార్యక్రమంలో ఉభయ దారులు కీ!! శే శ్రీ బొల్లినేని జయసింహ వీరి భార్య శ్రీ మతి కృష్ణవేణి వీరి కుమారుడు శ్రీ బొల్లినేని సందీప్, కోడలు శ్రీ మతి హర్షిత, మనవడు చి!! అవ్యాన్, బెంగళూరు, ఆలయ చైర్మన్ రేగటి నాగరాజు గారు, ధర్మ కర్తల మండలి సభ్యులు, దేవస్థానం అర్చకులు, సిబ్బంది, పోలిష్ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం, ప్రసాదాల పంపిణీ సమృద్ధిగా నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు.
ఈ గరుడ వాహన సేవతో బ్రహ్మోత్సవాలు మరింత భక్తి వైభవంగా కొనసాగుతున్నాయి.
పెన్నహోబిలంలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి గరుడ వాహన సేవ: భక్తులతో పోటెత్తిన ఆలయ ప్రాంగణం!
