Latest Posts

తాడిమర్రిలో బీజేపీ సంబరాలు ఘనంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కార్యకర్తల ఆనందోత్సాహం..

తాడిమర్రి, మే 4: తాడిమర్రి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సందర్భంగా సంబరాలు ఘనంగా నిర్వహించారు. తాడిమర్రి మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆరవేటి ఆనందు భాస్కర్ నాయుడు గారి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టి బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన విశేష ఫలితాలను పురస్కరించుకొని కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ విజయాన్ని ప్రజల మద్దతుగా అభివర్ణిస్తూ, భవిష్యత్తులో మరింత బలంగా పనిచేస్తామని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ధర్మవరం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంకా నాగార్జున, సింగిల్ విండో డైరెక్టర్ అనుగుత్తి రమణ, వైస్ ఎంపీపీ కృష్ణ నాయుడు, ఎస్పీ పోతలయ్య, కిసాన్ మోర్చా తాడిమర్రి అధ్యక్షుడు వెంకట్ నాయుడు, గంగులప్ప, బీజేవైఎం నాయకుడు చిన్న పార్థ, ఓబీసీ నాయకుడు గొంగటి రమేష్, గంగాధర, పెదయ్య, వీర రాఘవ, రమణయ్య, రాజశేఖర్, రవి, రామాంజనేయులు, ఆదినారాయణ, బిల్లే చంద్ర, కొంక తేజ ప్రతాప్, నారాయణస్వామి, చందు, ఏకపాదంపల్లి ఓసూరప్ప, రామాపురం చంద్ర, ఏటుకూరు నాయుడు, కునుకుంట్ల సురేంద్ర, దాడితోట గంగరాజు, కుల్లాయప్ప, అగ్రహారం నాగార్జున, లక్ష్మీనారాయణ, మరవపల్లి కిషోర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor