అనంతపురం జిల్లా, తాడిపత్రి.
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు
మండలంలోని దిమ్మగుడి సమీపంలో వంక వద్ద ఉన్న చౌడమ్మ ఆలయం సమీపంలో ఆదివారం రాత్రి గుప్తనిధులు ఉన్నాయని గ్రామానికి చెందిన కొందరు తవ్వకాలు జరుపుతున్న సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకుని ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. గుప్తనిధులు తవ్వకాలు జరుపుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు దాడులు చేయగా దిమ్మగుడికి చెందిన ధనుంజయలు, మడ్డిపల్లి గుర్రప్ప, రావులుడికి చెందిన జయరామిరెడ్డి, భీమునిపల్లికి చెందిన బాబయ్య, వెంకటరామిరెడ్డిలుగా గుర్తించారు. ఈ ఐదుగురిని అరెస్టు చేసి వీరితోపాటు అక్కడ ఉపయోగించే పూజాసామాగ్రి, గుప్తనిధుల తనిఖీ చేసే మిషన్ ఉప పరికరం, జెసిబి ని స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలుతోపాటు గ్రామ బహిష్కరణ ఉంటుందని ఆయన హెచ్చరించారు.
