రాయదుర్గం పట్టణంలో 1,000 మంది పేద కుటుంబాలకు ఉచితంగా టిట్కో ఇళ్లను అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

అనంతపురం జిల్లా –

రాయదుర్గం పట్టణంలో 1,000 మంది పేద కుటుంబాలకు ఉచితంగా టిట్కో ఇళ్లను అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

నిలిచిపోయిన ఈ నిర్మాణ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి, వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు

అందిస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణాలు స్తంభించిపోయాయని, మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పనులకు మోక్షం లభించిందని తెలిపారు.

ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ. 73.34 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ. 56 కోట్లు వెచ్చించారు.

మిగిలిన పనులను పూర్తి చేయడానికి మరో రూ. 27.52 కోట్లతో పనులను పునఃప్రారంభించారు.

పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలన్నది ఎన్టీఆర్ కల అని, దానిని బహుళ అంతస్తుల భవనాలుగా తీర్చిదిద్ది పేదలకు సౌకర్యవంతమైన జీవనం అందించడమే చంద్రబాబు నాయుడి లక్ష్యమని పేర్కొన్నారు.

రాయదుర్గ చరిత్రలో చారిత్రాత్మక దినం: అర్హులైన పేదలకు ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా ఈ ఇళ్లను అందజేస్తుండటం రాయదుర్గం సంక్షేమ చరిత్రలోనే ఒక మర్చిపోలేని రోజని వ్యాఖ్యానించారు.

Posted Under AP
Editor