అతనికి పెళ్లయింది. అయినా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఐదేళ్లుగా వారిద్దరూ సహజీవనంలోనే ఉన్నారు. అయితే, ఆమెకు డిగ్రీ చదివే కూతురు కూడా ఉంది. అతని కన్ను ఆ యువతిపై పడింది. కూతురు ఆ విషయాన్ని తల్లికి చెప్పింది. దాంతో బుద్ధి చెప్పాలనుకున్న ఆమె ప్రియుడు ఇంటికి రాగానే కాళ్లూ, చేతులు కట్టేసి మర్మాంగం కోసేసింది. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటన అనంతపురం నగరంలో చోటుచేసుకుంది ఐదేళ్లుగా ఓ మహిళతో ఆ వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు. అయితే, ఇప్పుడు అతని కన్ను ఆమె కూతురిపై పడింది. అర్ధరాత్రి సమయంలో తన కూతురిపై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. చూసీ చూసీ సహనం కోల్పోయిన ఆ తల్లి ఆ వ్యక్తి మర్మాంగం కోసేసింది. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం మేరకు.. అనంతపురం రూరల్ మండలం రాచానపల్లికి చెందిన ఆటో డ్రైవర్ సురేశ్‌కు వివాహమైంది. డ్రైవర్స్ కాలనీకి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఐదేళ్లుగా ఇద్దరూ సహజీవనంలో ఉన్నారు. ఈ క్రమంలోనే డిగ్రీ చదువుతున్న ఆమె కూతురిపై కన్నేశాడు. తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఆ కూతురు తన తల్లికి చెప్పింది.
సురేశ్‌కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఆ మహిళ అనుకుంది. ఎప్పటిలాగే సురేశ్ శుక్రవారం రాత్రి కూడా ఆమె ఇంటికి వెళ్లాడు. ఇదే అదునుగా వెరైటీగా ట్రై చేద్దామని చెప్పిన మహిళ.. చీరతో కాళ్లూ చేతులు కట్టేసింది. తన కూతురు జోలికి వస్తావా అంటూ కొట్టింది. ఆ కోపంలోనే కత్తి తీసుకుని అతడి మర్మాంగాన్ని కోసేసింది. దాంతో సురేశ్ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు సురేశ్‌ను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
ఐదేళ్లుగా సహజీవనం, కూతురిపై కన్నేసిన ప్రియుడు.. మర్మంగాన్ని మర్మాంగాన్ని కోసేసిన మహిళ
