అనంతపురం, బళ్లారి జిల్లాల్లో తాగునీటి కోసం
తుంగభద్ర జలాశయం వద్ద హెచ్ ఎల్ సి తూముకు శనివారం ప్రత్యేక పూజలను నిర్వహించి hlc కి 50 క్యూసెక్కులు తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసినట్లు జలాశయ అధికారులు తెలిపారు.
జలాశయం కు వచ్చే వరద నీటిని అంచనా వేసి ఆంధ్ర, కర్ణాటకలోని హెచ్ ఎల్ సి అధికారులు ఇచ్చిన ఇండెంట్ మేరకు నీటిని పెంచుతామని టీబీ డ్యాం se నారాయణ నాయక్ తెలిపారు.
కర్ణాటక అధికారులు తాగు నీటి కోసం 330 క్యూసెక్కులు నీరు ఇవ్వాలని, అలాగే ఆంధ్ర తరపున సరిహద్దులో బొమ్మనహల్ వద్ద 1500 క్యూసెక్కుల ప్రకారం తాగునీటి అవసరాలకు నీరు ఇవ్వాలని అనంతపురం hlc se సుధాకర్ రావు ఇండెoట్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుని హెచ్ఎసికి సోమవారం నుంచి నీటిని పెంచుతామని అధికారులు తెలిపారు.
