అనంతపురం జిల్లా , కళ్యాణదుర్గం.
పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన వారికి కాలేజ్ బ్యాగులను పంచిన ఎమ్మెల్యే అమిలినేని
కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను పిలిచి విద్యార్థులను ఘనంగా సన్మానించి వారికి కాలేజ్ బ్యాగ్ ను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా లోకేష్ గారు ప్రభుత్వ బడుల్లో కూడా నాణ్యమైన విద్యతో పాటు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్, నాణ్యమైన బట్టలు, పుస్తకాలు, షూస్ ఇవ్వడమే కాకుండా ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్న అందరికి ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు తల్లికివందనం అందించి మెరుగైన విద్యకు శ్రీకారం చుట్టారని గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ పేరుతో, బొమ్మలు వేసుకుని ఆనందించారే తప్ప విద్యార్థుల భవిష్యత్ ఆలోచించలేదని, విద్యా శాఖ మంత్రి వంద రోజుల ప్రణాళిక ద్వారా చదువులో వెనుకబడిన వారు సైతం బాగా చదివి ఉన్నత మార్కులు సాధించారని అన్నారు..నారా లోకేష్ గారి స్ఫూర్తితో కళ్యాణదుర్గం ప్రాంతంలో అసంపూర్తిగా వదిలేసిన పాలవాయి పాఠశాలను ఎస్సార్సీ ట్రస్ట్ ద్వారా 65 లక్షల రూపాయలు వెచ్చించి పూర్తి చేశామని, శెట్టూరు ఉన్నత పాఠశాలకు 55 లక్షల రూపాయలు విలువ చేసే డెస్కులు అందించామని, అలాగే విద్యార్థులకు క్రీడల్లో కూడా రాణించాలని కేపీఎల్ (కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్) నిర్వహించామని తెలిపారు..లోకేష్ సూర్తితో విద్యార్థులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
బైట్:- అమిలినేని సురేంద్రబాబు శాసనసభ్యులు కళ్యాణదుర్గం
