ముదిగుబ్బ యస్ 9
ముదిగుబ్బ మండల కేంద్రంలో గురువారం ముదిగుబ్బ అప్గ్రేడ్ సిఐ శివరాముడు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆటోలలో ఉన్న పక్క సీట్లను తొలగించారు.
ఈ సందర్భంగా ముదిగుబ్బ అప్‌గ్రేడ్ సీఐ శివరాముడు మాట్లాడుతూ, మైనర్లకు వాహనాలు నడపడానికి అనుమతించకూడదని ఆటో డ్రైవర్లకు కఠినంగా సూచించారు. అలాగే వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదాలను నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
