అనంతపురంలో హనీట్రాప్ ముఠా గుట్టురట్టు: ఐదుగురు నిందితుల అరెస్ట్.. రూ.13 లక్షల నగదు స్వాధీనం!

అనంతపురం జిల్లా,

అనంతపురంలో గత కొంతకాలంగా ప్రముఖులే లక్ష్యంగా సాగుతున్న హనీట్రాప్ ముఠా వ్యవహారం బట్టబయలైంది. హనీ ట్రాప్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతపురంలో గత కొంతకాలంగా ప్రముఖులే లక్ష్యంగా సాగుతున్న హనీట్రాప్ ముఠా వ్యవహారం బట్టబయలైంది. హనీ ట్రాప్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కింగ్ రంగమ్మ నాయుడు అలియాస్ చిన్ని నాయుడమ్మతో పాటూ దబ్బర రాజేష్, జయలక్ష్మి, మల్లేశ్వరి, అనంత కుమారిని అరెస్ట్ చేశారు. ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ముఠా ఇప్పటివరకు పలువురిని హనీ ట్రాప్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ‘మల్లేశ్వరి, రంగమ్మ నాయుడు పథకం ప్రకారం అమాయకులను, బాగా డబ్బున్నవాళ్లకు వల వేసి ట్రాప్ చేసేవారు. ఆపై బెదిరింపులకు పాల్పడి లక్షలాది రూపాయలు వసూలు చేసేవారు. నిందితుల వద్ద నుంచి రూ.13 లక్షల నగదు, రెండు కత్తులు, అలాగే ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నాం. అయితే, హనీ ట్రాప్‌కు గురైన బాధితులు కేసులు నమోదు చేయడానికి ముందుకు రావడం లేదు. ఎవరైనా ముందుకు వస్తే.. వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. ఈ కేసుకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదు. కొందరు నాయకులతో నిందితులు ఫొటోలు దిగిన విషయాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని అపోహలు సృష్టించవద్దు’ అని అన్నారు.

Posted Under AP
Editor