లక్నో/ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాకు చెందిన మైనారిటీ యువకుడు ఇప్పటికే ఐదుగురు మహిళలను వివాహం చేసుకున్నాడు.
ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి కిడ్నాప్ చేశాడు. 19 ఏళ్ల హిందూ యువతితో పెళ్లికి సిద్ధమైన ఆ యువకుడు అంతకుముందే ఆమెతో మతం మార్పించాడని వెలుగు చూసింది.
ఉత్తరప్రదేశ్ కు చెందిన రషీద్ అనే వ్యక్తికి ఐదుగురు భార్యలు ఉన్నారు. ఆ ఐదు మంది భార్యల్లో ఒకరు ముస్లిం కాగా, మిగతా నలుగురు భార్యలు హిందువులు కావడం గమనార్హం. 4 రోజుల క్రితం 19 ఏళ్ల యువతి తన తల్లి బంధువుల ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోవడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తే రషీద్ అసలు బండారం వెలుగులోకి వచ్చింది. యువతి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల ఇచ్చిన సమాచారం మేరకు నిందితుడు రషీద్ యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ మరో కుమార్తెను కూడా తీసుకెళ్లాలని బెదిరించాడు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తరువాత స్వామి యశ్వీర్ సింగ్‌తో సహా స్థానిక భజరంగ్ దళ్ కార్యకర్తలతో పాటు హిందూ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ బయట ఆందోళనకు దిగారు. లవ్ జీహాద్ వ్యవహారంతో సంబంధం ఉన్న రషీద్ తో పాటు మిగిలిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
