Latest Posts

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న ట్రాక్టర్..

ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల, రహీంఖాన్ పేట గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది.ఇల్లంతకుంట నుంచి సిరిసిల్ల వెళ్తోన్న బస్సు ట్రాక్టర్ ఢీకొట్టింది.

వల్లంపట్ల, రహీంఖాన్ పేట గ్రామాల మధ్య బస్సును సడన్ గా రోడ్డుపైకి వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు పల్టీలు కొడుతూ పక్కనున్న మామిటి తోటలోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరు స్వల్పంగా గాయపడ్డారు. బస్సును ట్రాక్టర్ ఢీకొట్టగానే.. అందులో ఉన్నవారు కేకలు వేశారు. ట్రాక్టర్ బస్సును ఢీకొట్టిన శబ్దం కూడా భారీగానే వచ్చింది.

దీంతో వ్యవసాయ పొలాల్లో పని చేస్తున్నవారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసులు సమాచారం ఇవ్వడంతో పాటు 108కి కూడా ఫోన్ చేశారు. గాయపడిన వారిని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40 ప్రమాణికులు ఉన్నట్లు తెలిసింది. ట్రాక్టర్ సడన్ గా రోడ్డుపైకి వచ్చిందని అక్కడున్నవారు చెప్పారు.

రోడ్డుపై బస్సు వేగంగా వెళ్తోందని.. అప్పుడే ట్రాక్టర్ రోడ్డుపైకి వేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ట్రాక్టర్ అనంతరానికి చెందిన ఓ వ్యక్తిదిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ట్రాక్టర్ బస్సు ఢీకొనే సమయంలో ట్రాక్టర్ పై నుంచి పక్కకు దూకడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ట్రాక్టర్ డ్రైవర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

YES9 TV