ఆలూరు పట్టణ కేంద్రంలోని బ్రహ్మకుమారి ఈశ్వర్య ఓం శాంతి సెంటర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలూరు సీఐ రవిశంకర్ రెడ్డి, ఎస్ఐ మన్మధ విజయ్ పాల్గొని శ్రీకృష్ణుని చిత్రపటానికి పూజలు నిర్వహించి, వేడుకల్లో సంబరంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీకృష్ణుని జీవిత విశేషాలతో పాటు భగవద్గీతలో ఆయన బోధించిన ధర్మం, సత్యం, కర్తవ్యనిష్ఠ, శాంతి మార్గాలను వివరించారు. కర్మ చేయడమే నీ బాధ్యత.. ఫలితాన్ని ఆశించకుండా ధర్మమార్గంలో నడవాలి అనే శ్రీకృష్ణుని సందేశాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని సూచించారు. భక్తి, ఆధ్యాత్మిక సందేశాలతో కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.
కర్నూలు జిల్లా ఆలూరు,ఆధ్యాత్మిక శోభతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. పాల్గొన్న సీఐ రవిశంకర్ రెడ్డి ఎస్ఐ మన్మధ విజయ్..
