ఐయుడబ్ల్యూజె జిల్లా కార్యదర్శిగా ప్రభ న్యూస్ విలేఖరి హారూన్ రషీద్ ఖాన్ ఎంపిక…

ఐయుడబ్ల్యూజె జిల్లా కార్యదర్శిగా ప్రభ న్యూస్ విలేఖరి హారూన్ రషీద్ ఖాన్ ఎంపిక…
ముదిగుబ్బ ఇండిపెండెంట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్( ఐ యు డబ్ల్యూ జె ) శ్రీ సత్య సాయి జిల్లా కార్యదర్శిగా ముదిగుబ్బ కి చెందిన ప్రముఖ వార్తా పత్రిక “ప్రభ న్యూస్” విలేఖరి. కుటాగుళ్ళ.హారూన్ రషీద్ ఖాన్ s/o.లేట్ మహమ్మద్ జాఫర్ ఖాన్ (కుమారుడు )ను రాష్ట్ర కమిటీ నియమించింది.సామాజిక సమస్యల పట్ల అత్యంత మెరుగైన దృక్పథంతో జర్నలిజంలో తనదైన శైలితో అత్యంత ఖచ్చితత్వంతో ముందుకు సాగుతున్న విలేఖరికి సముచిత స్థానం కల్పించడం తమ కనీస బాధ్యత అని రాష్ట్ర ఎంపిక కమిటీ సభ్యులు జీవీ. నాయుడు మరియు తెలంగాణ &ఆంధ్ర బ్యూరో చీఫ్ క్రాంతి కుమార్, మరియు సత్యసాయి జిల్లా బ్యూరో సత్యనారాయణ లు పేర్కొన్నారు. హారూన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ, తన పట్ల అపారమైన నమ్మకాన్ని ఉంచి తనకు అందించిన బాధ్యతలను తన కర్తవ్య దక్షతతో నిర్వహిస్తానని కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.

Posted Under AP
Editor