వెల్కమ్ టు YES9TV TELUGU … ✍️
- షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ అందుకున్న 5 మంది విద్యార్థులు
- 500 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు సన్మానం
- సేవలకు గుర్తింపుగా ఎస్ఎంసి చైర్మన్ గౌస్ కు సత్కారం
కర్నూలు జిల్లా గోనెగండ్ల ఏపీ మోడల్ స్కూల్ నందు మెగా పేరెంట్స్ 4.0″ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ షాహిన్ పర్వీన్ అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమానికి ఎంపీడీవో మణిమంజరి మరియు డిప్యూటీ ఎంపీడీవో శశికళ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో “షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ అందుకున్న ఐదుగురు విద్యార్థులను ఎంపీడీవో మణిమంజరి ఎంఈఓ రామాంజనేయులు ఘనంగా సత్కరించారు. అలాగే 500 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు శాలువా మరియు మెమెంటో అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎంసి చైర్మన్ గౌస్ పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు గాను, ప్రిన్సిపల్ షాహిన్ పర్వీన్ గౌస్ ని, ఎస్ఎంసి చైర్మన్ మరియు కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి కమిటీ సభ్యులు వార్డ్ నెంబర్ అక్బర్ వలి ఎస్ఎంసి వైస్ చైర్మన్ దోమ విమల, గానిగా భాష, రషీదా భాను, లోకేష్,విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
YES9TV TELUGUతో గోనెగండ్ల విలేకరి షైక్ సుభాన్ .. ✍️
