శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం – కసాపురం.
23.07.2026 గురువారము కడప పట్టణ వాస్తవ్యులు శ్రీ చంద్ర ఓబుల్ రెడ్డి (కే.ఎస్.ఆర్.ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కడప ) వారు భక్తుల సౌకర్యార్థం 1 బ్యాటరీ వాహనాన్ని విరాళంగా సమర్పించారు, మరియు దేవస్థానం కొనుగోలు చేసిన మరొక నూతన బ్యాటరీ వాహనంతో కలిపి వేద పండితులు అర్చకులు వాహన పూజ నిర్వహించారు.
దాతలకు శేష వస్త్రం శ్రీ స్వామి వారి ప్రసాదం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీ మేడేపల్లి విజయ రాజు గారు, అనువంశిక ధర్మకర్త శ్రీ కే అనంతచార్యులు గారు , ప్రధాన అర్చకులు శ్రీ కే రాఘవాచార్యులు గారు, అర్చకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
