వేదవతి ప్రాజెక్టును పూర్తి చేయాలి..సీపీఐ

–వేదవతి ప్రాజెక్టును పూర్తి చేయాలి..సీపీఐ
–హంద్రీ–నీవా కాలువ ద్వారా అన్ని చెరువులను నింపాలని డిమాండ్..
–ఆస్పరిలో సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా..
ఆలూరు న్యూస్…
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండల కేంద్రంలో గురువారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సీపీఐ నాయకులు మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలకు శాశ్వత తాగునీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు వేదవతి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే హంద్రీ–నీవా కాలువ ద్వారా ఆలూరు నియోజకవర్గంలోని అన్ని చెరువులను నింపి రైతులకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. తాగునీరు, సాగునీటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…

Posted Under AP
Editor