Latest Posts

హైటెన్షన్ విద్యుత్ లైన్లకు సంబంధించి నష్టపరిహారం పెంచాలని జాయింట్ కలెక్టర్‌కు రైతుల వినతి…

ముదిగుబ్బ yes9TV
శ్రీ సత్యసాయి జిల్లా: సానేవారిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేస్తున్న 132 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ల కారణంగా ప్రభావితమైన రైతులు, తమకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని పెంచాలని కోరుతూ ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, 2022 భూముల విలువ ఆధారంగా కాకుండా, ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం నిర్ణయించి చెల్లించాలని కోరారు. హైటెన్షన్ విద్యుత్ లైన్ల వల్ల వ్యవసాయ భూముల వినియోగంపై శాశ్వత ప్రభావం పడుతుందని, అందువల్ల రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ ముదిగుబ్బ మండల అధ్యక్షుడు తుమ్మల మనోహర్ గారు, బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు గారు, ధర్మవరం సింగిల్ విండో డైరెక్టర్ రామాంజనేయులు గారు, బండి మల్లికార్జున, గుత్తా కార్తీక్ నాయుడు, తోలేట్ ఆదినారాయణ రెడ్డి, మదాసు గంగాధర్, మదాసు హేమంత్ కుమార్, మల్లెల నారాయణస్వామి తదితర రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor