ముదిగుబ్బ పోలీసుల ప్రత్యేక తనిఖీలు – డ్రంక్ అండ్ డ్రైవ్

ముదిగుబ్బ పోలీసుల ప్రత్యేక తనిఖీలు – డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 7 మందిపై చర్యలు
ముదిగుబ్బ yes9 TV
ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారి ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో 19.07.2026 తేదీన మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరు వ్యక్తులతో పాటు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న మరో ఐదుగురిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ముదిగుబ్బ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో:
1. పులేటి నరేంద్ర, వయస్సు 26 సంవత్సరాలు, తండ్రి పి. రాము, డి.నెం.1-816, ముదిగుబ్బ గ్రామం & మండలం.
2. అజయ్ కోల్, వయస్సు 23 సంవత్సరాలు, తండ్రి రాజేష్, స్కూల్ కె పాస్ బ్రంరహా, షహడోల్, మధ్యప్రదేశ్.
పై ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడగా, బ్రెత్ అనలైజర్ పరీక్షలో మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. అనంతరం వారిని గౌరవనీయులైన న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, ప్రతి ఒక్కరికి రూ.10,000/- చొప్పున జరిమానా విధించబడింది.
బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించినందుకు:
1. జుటూరు ప్రతాప్ రెడ్డి, వయస్సు 66 సంవత్సరాలు, గునిపల్లి గ్రామం, బుక్కపట్నం మండలం.
2. జుటూరు చిన్న నాగిరెడ్డి, వయస్సు 65 సంవత్సరాలు, గునిపల్లి గ్రామం, బుక్కపట్నం మండలం.
3. జుటూరు రవిశంకర్ రెడ్డి, వయస్సు 51 సంవత్సరాలు, గునిపల్లి గ్రామం, బుక్కపట్నం మండలం.
4. బొమ్మక నరేష్ రెడ్డి, వయస్సు 32 సంవత్సరాలు, ముదిగుబ్బ గ్రామం & మండలం.
5. ఆనంద్ రాజ్, వయస్సు 53 సంవత్సరాలు, ముదిగుబ్బ గ్రామం & మండలం.
పై ఐదుగురు వ్యక్తులు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న సమయంలో ముదిగుబ్బ పోలీసులు అదుపులోకి తీసుకుని, చట్టపరమైన చర్యలు చేపట్టారు. అనంతరం వారిని గౌరవనీయులైన న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, ప్రతి ఒక్కరికి రూ.1,000/- చొప్పున జరిమానా విధించబడింది.
ఈ సందర్భంగా ముదిగుబ్బ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరము మరియు మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ప్రజలకు మరియు వాహనదారులకు ప్రమాదం కలుగుటకు దారి తీయవచ్చునని తెలిపారు. ఇలాంటి చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు. ప్రజలందరూ చట్టాలను గౌరవించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,
ముదిగుబ్బ U/G పోలీస్ స్టేషన్.

Posted Under AP
Editor