కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు..

అనంతపురం, జూన్ 16 :

కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆకస్మిక తనిఖీ చేశారు. మంగళవారం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భవతుల వార్డు, మహిళల వార్డు, ఆసుపత్రిని తనిఖీ చేసి, రోగులతో వైద్య సేవల గురించి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఆరా తీశారు. అనంతరం వైద్యుల హాజరు పట్టిని పరిశీలించారు. ఇన్ టైం మాత్రమే ఎంటర్ చేసి ఉన్నట్లు గుర్తించి ఆసుపత్రి సిబ్బందిని హెచ్చరిక చేశారు. ఆసుపత్రిలో శుభ్రత బాగుందని, ఆక్సిజన్ ప్లాంట్ అవసరం ఉందని త్వరలో ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Posted Under AP
Editor