లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలి..

  • లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలి
  • డిఆర్డీఏ, మెప్మా శాఖల సమీక్షలో కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశం

అనంతపురం, జూన్ 17: డిఆర్డీఏ, మెప్మా శాఖల పరిధిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ సూచించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయా శాఖల అధికారులతో పురోగతిని పరిశీలించారు.
పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద రుణాలు గ్రౌండింగ్ అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. యూనిట్ల ఏర్పాటుకు సిద్ధం చేసే డీపీఆర్‌లు నాణ్యతతో ఉండాలని, ప్రతి మండలంలో కనీసం ఐదు యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. డిఆర్డీఏ, మెప్మా పరిధిలో రుణాల మంజూరు లక్ష్యాలను చేరుకోవడంతో పాటు బ్యాంక్ లింకేజీ ద్వారా మునగ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
మార్కెట్‌లో మంచి అవకాశాలు ఉన్న ఉత్పత్తులను గుర్తించి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించిన కలెక్టర్, ఎఫ్‌పీఓలు, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్స్ సర్వే, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, మష్రూమ్ శిక్షణ కార్యక్రమాలు, ‘మన డబ్బులు-మన లెక్కలు’ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.
స్త్రీనిధి పారామీటర్ల అమలుపై ఏపీఎంలతో ప్రతిరోజూ సమీక్ష చేపట్టాలని సూచించారు. అలాగే మెప్మా పరిధిలో మైక్రో క్రెడిట్ ప్లాన్, బ్యాంక్ లింకేజీ, పీఎం స్వానిధి తదితర పథకాల కింద కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.
సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ డీపీఎంలకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శైలజ, ఏపీడీ రాధారాణి, డీపీఎం గంగాధర్, మెప్మా టెక్నికల్ ఎక్స్‌పర్ట్ భవాని, లైవ్లీహుడ్ టెక్నికల్ ఎక్స్‌పర్ట్ వాసుదేవరెడ్డి, వెంకటేష్, డీపీఎంలు సత్యనారాయణ, రవీంద్రబాబు, రాజ్యలక్ష్మి, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor