వేరుశనగ విత్తన పంపిణీ శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం లో రైతులందరికీ ఖరీఫ్ 2026 సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రభుత్వం 40% సబ్సిడీతో వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని మండల వ్యవసాయ అధికారి అయిన అబ్దుల్ హక్ తెలియజేశారు. కావున రైతులందరూ మంగళవారం నుంచి సంబంధిత రైతు సేవా కేంద్రం నందు తమ ఆధార్ కార్డు జిరాక్స్ పొలం పాస్ బుక్ జిరాక్స్ మరియు ఫోన్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుని డబ్బులు చెల్లించవలసిందిగా తెలిపారు. క్వింటా వేరుశనగ ధర 10,200 రూపాయలు కాగా అందులో రైతు వాటా 6120/- రూపాయలని తెలిపారు. ఒక్కో రైతుకు వారి విస్తీర్ణాన్ని బట్టి కనీసం ఒక బస్తా మరియు గరిష్టంగా మూడు బస్తాల వరకు కేటాయిస్తారని తెలియజేశారు.
అందుబాటులో ఉన్న వేరుశెనగ రకం K-6 & TCGS-1694
నల్లమాడ మండలంలో 40% సబ్సిడీతో వేరుశనగ విత్తన పంపిణీ ప్రారంభం..
