ముదిగుబ్బ శాఖా గ్రంథాలయంలో ముగిసిన వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు

ముదిగుబ్బ yes9TV
ముదిగుబ్బ శాఖా గ్రంథాలయము నందు వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు ఏప్రిల్ 28 వ తేదీ నుండి జూన్ 6 వతేది వరకు 40 రోజులుగా నిర్వహించడం జరిగినది. ఈరోజు అనగా 06-6-2026 తేదీన ముగింపు సందర్భంగా గ్రంథాలయ అధికారి మూడే బొజ్జే నాయక్ ఆధ్వర్యంలో స్థానిక గ్రంథాలయము నందు ముగింపు సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంనకు ముఖ్య అతిథులుగా TDP మండల కన్వీనర్ శ్రీ తుమ్మల మనోహర్ గారు,MEO శ్రీ రమణప్ప గారు, యోగా టీచర్ శ్రీమతి ప్రభావతి గారు మరియు ఉపాధ్యాయులు శ్రీ విజయభాస్కర్ గారు హాజరవడం జరిగింది. అతిధులచే జ్యోతి ప్రజ్వలన గావించి ప్రార్థనా గేయంతో సభను ప్రారంభిచడం జరిగింది. శ్రీ తుమ్మల మనోహర్ గారు మాట్లాడుతూ : విద్యార్థిని విద్యార్థులు చిన్నతనము నుండి గ్రంథాలయమునకు వచ్చి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని తెలిపారు మరియు సభాముఖంగా ఒక దాతగా గ్రంధాలయానికి అవసరం అయినవి సమాకూర్చి గ్రంధాలయ అభివృద్ధి లో భాగస్వామి అవుతానని హామీ తో గ్రంధాలయల మీద వారికున్న ప్రేమ, ఉదారత చాటుకున్నారు తదుపరి మిగిలిన అతిధులు మాట్లాడుతూ: చినిగిన చొక్కా అయినా తొడుక్కో – ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఒక మంచి మాట తో పుస్తకం విలువను పుస్తకం ఆవశ్యకతను గురించి తెలుపుతూ, పుస్తకము ఒక మంచి నేస్తం అని పుస్తకాలను చదివే అలవాటు చిన్నప్పటినుంచే అలవర్చుకోవాలని, నేటి చరిత్ర భావితరాలకు అందించే ఒక అద్భుతమైన రూపమే పుస్తకం, అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానమనే జ్యోతిని మనలో వెలిగించి ముందుకు నడిపేసాధనమే పుస్తకమని తెలియజేశారు. అనంతరం వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులలో నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు ప్రముఖులచే బహుమతుల ప్రధానం చేయడం జరిగినది*. విద్యార్థులకు స్వీట్స్ మరియు బిస్కెట్స్ పంచడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి మూడే బొజ్జే నాయక్, స్థానిక నాయకులు శ్రీ నారాయణ స్వామి గారు శ్రీ చరణ్ గారు తదితరులు, పాత్రికేయులు, పాఠకులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు….

Posted Under AP
Editor