తొలి 1000 రోజుల శిశు సంరక్షణపై ఏఐ శిక్షణ కార్యక్రమం.

తాడిమర్రి( yes9tv )తొలి 1000 రోజుల శిశు సంరక్షణపై ఏఐ శిక్షణ కార్యక్రమం
తాడిమర్రి, జూన్ 5: బత్తలపల్లి ప్రాజెక్టు పరిధిలోని తాడిమర్రి మండల జెడ్పీహెచ్‌ఎస్ (Z.P.H.S.) పాఠశాలలో శుక్రవారం సీడీపీఓ సరస్వతి ఆధ్వర్యంలో అంగన్‌వాడీ సిబ్బందికి ఏఐ (AI) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ గోవర్ధన్ రాయుడు మాట్లాడుతూ శిశువు జీవితంలో అత్యంత కీలకమైన మొదటి 1000 రోజుల సంరక్షణ గురించి వివరించారు. గర్భధారణ ప్రారంభం నుంచి రెండేళ్ల వయస్సు వరకు పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, ఎదుగుదల మరియు మానసిక వికాసంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు.
అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న నవచేతన కార్యక్రమం లక్ష్యాలు, ప్రయోజనాలు మరియు అంగన్‌వాడీ కార్యకర్తల పాత్రపై అవగాహన కల్పించారు. శిక్షణలో కృత్రిమ మేధస్సు (AI) ద్వారా అంగన్‌వాడీ సేవలను మరింత సమర్థవంతంగా అందించే విధానాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో మండల సూపర్‌వైజర్లు ఎం. లలితమ్మ, చంద్రమ్మ పాల్గొని పలు సూచనలు చేశారు. మొత్తం 63 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు శిక్షణలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Posted Under AP
Editor