కళ్యాణదుర్గంలో గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్: 450 గ్రాముల గంజాయి స్వాధీనం!

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం.

అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు పర్యవేక్షణలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి పట్టుబడ్డాడు.

కళ్యాణదుర్గం పట్టణ శివారులోని కంబదూరు రోడ్డులో ఉన్న స్పైస్ అవెన్యూ రెస్టారెంట్ సమీపంలో గంజాయి అమ్ముతున్నాడనే సమాచారంతో పట్టణ సీఐ హరినాథ్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.
ఈ దాడిలో కర్ణాటక రాష్ట్రం Y N H కోట కు చెందిన ఎరుకల అన్వేష్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు కళ్యాణదుర్గం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడి వద్ద నుంచి సుమారు 450 గ్రాముల గంజాయిని రెవెన్యూ అధికారుల సమక్షంలో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానానికి తరలించారు

Posted Under AP
Editor