వారం రోజుల్లోపు సమస్యలన్నీ పరిష్కరించాలి…

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

వారం రోజుల్లోపు సమస్యలన్నీ పరిష్కరించాలి..

– : వరుసగా మూడవ శుక్రవారం రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు కార్యక్రమం..

– : పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..

– రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామంలో వరుసగా మూడవ శుక్రవారం ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, రైతుల నుంచి సమస్యలను తెలుసుకుని వారి నుంచి వినతి పత్రాలను విప్, జిల్లా కలెక్టర్ స్వీకరించారు.

– ఈ కార్యక్రమంలో మొదటివారం 36 అర్జీలను స్వీకరించడం జరగగా, రెండవ వారం 28 అర్జీలను స్వీకరించడం జరగగా, ఈరోజు మూడవ శుక్రవారం 22 అర్జీలను ప్రజల నుంచి ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఇందులోభాగంగా ఏ రకమైన అర్జీలు వచ్చాయి అనేది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్, ఎంపిడిఓ, ఆయా శాఖల మండల స్థాయి అధికారులతో అర్జీల పరిష్కారంపై ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, వరుసగా మూడువారాల పాటు వచ్చిన సమస్యలన్నీ వచ్చే వారం రోజుల్లోపు ఖచ్చితంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేయాలన్నారు.

– ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డీవో వసంత బాబు, తహసీల్దార్ హరికుమార్, ఆయా శాఖల అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Posted Under AP
Editor