ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 200 మొక్కల నాటకం – కృతజ్ఞతలతో
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముదిగుబ్బ మండలంలోని శ్రీ గొంగటి లింగాయపల్లి వీరనారాయణ స్వామి వారి ఆలయ సమీపంలోని స్వామి మైదానంలో దాదాపు 200 మొక్కలను నాటడం జరిగింది.
ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి మొక్కలను అందించి, పచ్చని భవిష్యత్తు కోసం తన వంతు సహకారం అందించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ Y. Satya Kumar Yadav గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము..
ప్రజా సంక్షేమం పట్ల ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తూ, పర్యావరణ పరిరక్షణకు కూడా విశేష ప్రాధాన్యత ఇస్తున్న మంత్రివర్యుల మంచి మనసుకు ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం, పచ్చని ప్రకృతిని అందించాలనే వారి దూరదృష్టి అభినందనీయం.మనం నేడు నాటిన ఈ మొక్కలు రేపటి మహావృక్షాలుగా మారి వేలాది మందికి ప్రాణవాయువును అందిస్తాయి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో, భూగర్భ జలాలను పెంపొందించడంలో, పక్షులు మరియు ఇతర జీవరాశులకు ఆశ్రయం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, గ్రీనరీ పెంపొందించడంలో ఈ మొక్కలు అమూల్యమైన సేవలను అందిస్తాయి.
“ఒక మొక్క నాటడం అంటే ఒక ప్రాణాన్ని కాపాడినట్లే” అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉంది. నేటి ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెరిగి, పచ్చదనాన్ని పెంపొందించే దిశగా అందరూ ముందుకు రావాలని కోరుతున్నాను.
మరొకసారి ఈ మహత్తర కార్యక్రమానికి మొక్కలను అందించి సహకరించిన గౌరవ మంత్రివర్యులు శ్రీ వై. సత్య కుమార్ యాదవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి సేవలు ప్రజలకు, పర్యావరణానికి మరింతగా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ గొడ్డుమర్రి ఆదినారాయణ గారు ముదిగుబ్బ ఎంపీపీ, డిడిఒ సార్ స్పెషల్ ఆఫీసర్ జనార్ధన్ ఏ పిడి వెంకట చలపతి గారు ఎంపీడీవో హాజీ వలి సాబ్ ఏపీఓ గోపాల్ గారు సచివాలయ సిబ్బంది సర్పంచ్ వేణుగోపాల్ నాగభూషణ ఎంపీటీసీ తిరుపాలమ్మ బీజేవైఎం యువమోర్చా వైస్ ప్రెసిడెంట్ చత్రపతి ఓబిసి మండల అధ్యక్షుడు చంద్రమోహన్ బిజెపి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంగాధర్ రెడ్డి బిజెపి నాయకులు రవి లక్ష్మీపతి ఆదినారాయణ నాయుడు నారాయణస్వామి వేణు బిజెపి నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది…
“చెట్లను నాటుదాం – పర్యావరణాన్ని కాపాడుదాం – భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందిద్దాం.”
