పర్యావరణ దినోత్సవ సందర్భాన మొక్కలు నాటిన ఎంపీడీవో అంజనప్ప, తెలుగుదేశం నాయకులు
ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేర
సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండల కేంద్రంలోని పారిశుద్ధ కేంద్రంలో ఎంపీడీవో అంజనప్ప గారు, తెలుగుదేశం నాయకులు మొక్కలు నాటారు,
ఎంపీడీవో అంజనప్ప గారు, మండల కన్వీనర్ మైలేజ్ శంకర్, బుట్టి నాగభూషణ నాయుడు, మాట్లాడుతూ మనం పకృతిని రక్షించినప్పుడు పకృతి మనల్ని రక్షిస్తుంది, మొక్కలు నాటండి భవిష్యత్తును కాపాడండి, ప్రతి చెట్టు ప్రాణ వాయువు, నీటిని ఆధా చేయండి జీవాలను కాపాడండి, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచండి, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి, భవిష్యత్ తరాల వారికి మనం ఇచ్చే అమూల్య కానుక పచ్చని చెట్లు నాటి, వాటిని భవిష్యత్ తరాలు కానుకగా ఇవ్వాలని పిలుపునివ్వడం జరిగింది,
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అంజనప్ప, మండల కన్వీనర్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
