తాడిమర్రి (yes9tv )అమ్మ పేరుతో ఒక మొక్క” – నిడిగల్లులో ఘనంగా పర్యావరణ దినోత్సవ వేడుకలు
ధర్మవరం నియోజకవర్గంలో 10 వేల మొక్కల లక్ష్యానికి శ్రీకారం
తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా 10 వేల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా నిడిగల్లు గ్రామంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, గ్రామస్తులు కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎంపీడీవో వెంకట రంగారావు, డిప్యూటీ ఎంపీడీవో విజయశేఖర్ నాయుడు, ఏపీవో అనిల్ కుమార్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి హేమలత, ఈసీ సాయికృష్ణా రెడ్డి, టీఏ భారతి పాల్గొన్నారు.
అలాగే బీజేపీ మండల కన్వీనర్ దేవర రామ్మోహన్ (దేవర రాము) మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామాల్లో హరితహారం పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తూ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయడంలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారని నాయకులు కొనియాడారు. అదేవిధంగా యువతలో పర్యావరణంపై అవగాహన పెంచుతూ, మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు చెంచుగొల్ల రామాంజనేయులు, వైస్ ఎంపీపీ కృష్ణంనాయుడు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంగులప్ప, మండల అధ్యక్షుడు గోనుగుంట్ల వెంకటనాయుడు, మండల ప్రధాన కార్యదర్శి దాసరి రామాంజనేయులు, ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు గంగాధర్, బిల్లే చంద్రతో పాటు గ్రామ ప్రజలు, ఉపాధి హామీ శ్రామికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు. ధర్మవరం నియోజకవర్గాన్ని హరితవనంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు
పర్యావరణ దినోత్సవం: మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపుతో నిడిగల్లులో భారీగా మొక్కల నాటడం!
