ఎన్టీఆర్ 103 వ జయంతిని ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు…

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుగొండ.

ఎన్టీఆర్ 103 వ జయంతిని ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం వ్యాప్తంగా పసుపు పండుగ మహానాడు రెండో రోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి జయంతిని ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ఐదు మండల కేంద్రాల్లో ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హాస్పిటళ్లలో రోగులకు బెడ్లు పంపిణీ చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. “మరణం లేని మహానేత ఎన్టీఆర్” అంటూ నాయకులు ఆయన సేవలను స్మరించుకున్నారు.

అనంతరం పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్‌ల ద్వారా మంగళగిరిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. అలాగే ప్రతి మండల కేంద్రంలో నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై చర్చలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు నరసింహారావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Posted Under AP
Editor