శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్, చేనేత & జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవితమ్మ ఆదేశాల మేరకు టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.
గోరంట్ల బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన నాయకులు అనంతరం జెండా వందనం నిర్వహించారు. తరువాత ఎస్‌ఎల్‌ఎన్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన మహానాడు కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి పెనుకొండ నియోజకవర్గ పరిశీలకులు నరసింహారావు రాయల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వంలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొని ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు.
గోరంట్లలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు: మహానాడులో పాల్గొన్న టీడీపీ శ్రేణులు
