ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల…

అనంతపురం జిల్లా, కలెక్టరేట్.

ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల

అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల అమలుపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ భవనంలో జరిగిన ఈ సమావేశానికి SERP-AP విజయవాడ డైరెక్టర్ (పెన్షన్లు) సుధాకర్ హాజరై జిల్లాలో అమలవుతున్న ‘IVRS-PPP’ వ్యవస్థపై సమీక్ష చేపట్టారు.
జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలన కార్యదర్శులు మరియు పింఛన్ పంపిణీ అధికారులతో సమావేశమై పనితీరు తక్కువగా ఉన్న మండలాలు, మున్సిపాలిటీలు, స్వర్ణ గ్రామాలు మరియు వార్డుల పురోగతిని ఆయన పరిశీలించారు.
పింఛనుదారుల నుంచి వచ్చే IVRS-PPP ఫీడ్‌బ్యాక్ కాల్స్‌ను సమర్థంగా నిర్వహించాలని, లబ్ధిదారుల సరైన మొబైల్ నంబర్లను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని సూచించారు. అలాగే పింఛన్ పంపిణీ సమయంలో అధికారులు మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం ద్వారా పింఛనుదారుల్లో ప్రభుత్వ పథకాలపై సానుకూల దృక్పథం పెంపొందించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి శైలజ, జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు, జిల్లా పరిషత్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మల్లికార్జునతో పాటు డీఆర్‌డీఏ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor