నల్లమాడలో తెలుగుదేశం కార్యకర్తల పసుపు పండగ
ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేర
సత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలోని షాది మహల్ లో క్లస్టర్ 8 ఇంచార్జ్ బి కే కేశవరెడ్డి ఆధ్వర్యంలో ఎల్ఈడి స్క్రీన్ ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు పర్యవేక్షణలో జరిగే మహానాడు ప్రతి ఒక్క కార్యకర్త తన మనోభావాలు క్లస్టర్ 8 ఇంచార్జ్ బీకే కేశవరెడ్డి కి తెలుపు కొని ఈ సమస్యను జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ గారికి తెలియజేయడం జరుగుతుందని అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు సామాన్య ప్రజలకు చేరే విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ప్రజలకు ఎంత ఉపయోగపడతాయని ప్రజలకు వివరించాలని నాయకులు ,కార్యకర్తలకు తెలిపారు
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
