మహానాడులో పాల్గొన్న జోనల్ ఇంచార్జ్, పార్లమెంట్ అధ్యక్షుడు..

మహానాడులో పాల్గొన్న జోనల్ ఇంచార్జ్, పార్లమెంట్ అధ్యక్షుడు

కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని రెండు క్లస్టర్ ల పరిధిలో సిరి కన్వెన్షన్ లో జరిగిన పసుపు సైనికుల మహా పండుగ వర్చువల్ మహానాడుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు, రాయలసీమ జోనల్ ఇంచార్జ్ రెడ్డప్ప గారి శ్రీనివాస రెడ్డి, అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు పూల నాగరాజు, మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ మొహిద్దీన్, కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ వైపీ రమేష్, సీనియర్ నాయకుడు చౌలం మల్లికార్జున, మండల పార్టీ అధ్యక్షులు గోళ్ల వెంకటేషులు, పట్టణ అధ్యక్షులు మాదినేని మురళి స్థానిక నాయకులతో కలసి పాల్గొని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, నట సార్వభౌముడు ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు..

Posted Under AP
Editor