నల్లమాడలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల కేంద్రంలో ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ దుద్దికుంట శ్రీధర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు వైయస్సార్సీపి కార్యాలయం దగ్గర కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు మండల కన్వీనర్ చిట్టిబాల ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పార్టీని మరింత బలోపేతం చేసేలాగా అడుగులు వేయాలని అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, తెలిపారు ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది

Posted Under AP
Editor