Yes 9 TV, October 31:
కడప జిల్లా బద్వేల్ పట్టణం మైదుకూరు రోడ్డులోవున్న స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా నుంచి ఈరోజు (శనివారం) మధ్యాహ్నం రఘునాధ పురానికి చెందిన బయన్న అనే వ్యక్తి తన అవసర నిమిత్తం 9 లక్షల 50 వేలు నగదు డ్రా చేసుకొని తన బైక్ సైడ్ బ్యాగులో పెట్టుకొని బండి ఎక్కేలోగా దుండగుడు చాకచక్యంగా అపహరించుకొని పరారయ్యాడు. వెంటనే క్యాష్ పోయిందని గమనించిన భాధితుడు చుట్టు ప్రక్కల వెతికినా ఫలితం కనిపించక భాదతో ఏడుపు మొదలు పెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ మొదలుపెట్టారు.
