Latest Posts

తమిళనాడుకు చెందిన తండ్రి, కుమారుడు, వృద్ధ మహిళ ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల విన్నపం

విజయవాడ, తేదీ: 27.05.2026
తమిళనాడుకు చెందిన తండ్రి, కుమారుడు, వృద్ధ మహిళ ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల విన్నపం

తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు రేంజ్ క్రైం బ్రాంచ్ సీఐడీ అధికారులు ముగ్గురు కనిపించకుండా పోయిన ఘటనపై ప్రజల సహకారం కోరుతున్నారు. రాణిపేట జిల్లా అరక్కోణం రోడ్డు పరిధిలోని సోలింఘర్ గ్రామానికి చెందిన డి. రాజేష్ కుమార్ (39), ఆయన కుమారుడు ఆర్. సశ్వంత్ రాజేష్ (7), తల్లి డి. లలిత (65)లు 13 నవంబర్ 2022 నుండి కనిపించకుండా పోయినట్లు వెల్లూరు సీబీసీఐడీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

దీనిపై డి. రాజేష్ కుమార్ భార్య శ్రీమతి ఆర్. సూర్య (36) ఫిర్యాదు చేసినట్లు తమిళనాడు వెల్లూరు రేంజ్ క్రైం బ్రాంచ్ సీఐడీ డీఎస్పీ బి. సురేష్ పాండ్యన్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కుటుంబ సమస్యల కారణంగా డి. రాజేష్ కుమార్ తన కుమారుడు ఆర్. సశ్వంత్ రాజేష్, తల్లి డి. లలిత ను తీసుకొని వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గత మూడున్నర సంవత్సరాలుగా భర్త, కుమారుడు, అత్త ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు.

కుటుంబంలో ఏవైనా అపార్థాలు, మనస్పర్థలు ఉన్నా వాటిని పెద్ద మనసుతో క్షమించి, గత విషయాలను మరచి మళ్లీ అందరం కలిసి సంతోషంగా జీవించాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. కుటుంబ సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని తిరిగి ఇంటికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.. పై ముగ్గురు ఎక్కడైనా కనిపించినా, ఆచూకీ తెలిసినా సమీప పోలీస్ స్టేషన్‌కు, కటుంబ సభ్యులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

క్రైం బ్రాంచ్ సీఐడీ: 98658 68988, 94981 05739, 0416-2263834

కుటుంబ సభ్యులు పెద్ద అక్క: 83309 43925, చిన్న అక్క: 96771 36687, భార్య సూర్య: 63749 27726

జారీ చేసినవారు: సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్

Posted Under AP
Editor