ఆసిఫాబాద్ జిల్లాలో ఘరానా మోసం: రూ. 75 వేలు కాజేసిన కేటుగాళ్లు

ఆసిఫాబాద్ జిల్లా.

ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో పట్టపగలే మోసపూరిత ఘటన చోటుచేసుకుంది. శ్యామ్ రావు అనే రైతు బ్యాంకు నుండి రూ.75,000 నగదు తీసుకుని ఇంటికి వెళ్తుండగా, నలుగురు దుండగులు అతన్ని వెంబడించారు. “మీ బైక్ నుంచి డబ్బులు పడిపోయాయి” అంటూ నమ్మబలికి, అతని దృష్టి మరల్చి, బైక్ కవర్లో ఉన్న నగదును అపహరించి క్షణాల్లో అక్కడి నుంచి పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు

Editor