గుత్తి ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్..

అనంతపురం జిల్లా, గుత్తి.

*గుత్తి ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్

– *గుత్తి నూతన ఆర్టీసీ బస్టాండ్ ను త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం గుత్తి మండల కేంద్రంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ లో చేపడుతున్న నూతన బస్టాండ్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బస్టాండ్ ఆవరణం అంతా కలియ తిరిగి మ్యాప్ ద్వారా నూతన బస్టాండ్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందుగా తాత్కాలిక బస్టాండ్ నిర్మించడం జరుగుతుందని, అనంతరం శాశ్వత ఆర్టీసీ బస్టాండ్ ను నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బస్టాండ్ లో డ్రైన్ కోసం ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం శ్రీలక్ష్మి, సివిల్ డిఈ సురేంద్రబాబు, డిఎం, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, తహసిల్దార్ పుణ్యవతి, ఎంపీడీవో ప్రభాకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor