పీఎం స్వానిధి పథకం కింద అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

అనంతపురం జిల్లా, గుత్తి.

పీఎం స్వానిధి పథకం కింద అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

– *గుత్తి పట్టణంలోని చిరు వ్యాపారస్తులు ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం గుత్తి పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న నాగవేణి తోపుడు బండి వద్దకు వెళ్లి జిల్లా కలెక్టర్ చిరు వ్యాపారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద తీసుకున్న రుణాలను కట్టగలుగుతున్నారా, ఈ పథకం వల్ల ఉపయోగాలు ఉన్నాయా, మీరు అడిగిన వెంటనే రుణాలు అందిస్తున్నారా, సంఘాల్లో ఉన్నవారికి రుణం దరఖాస్తు చేసుకున్నాక రుణాలు వచ్చాయా, తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెప్మా కింద ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద అర్హత కలిగిన వారికి సకాలంలో రుణాలను అందజేయాలన్నారు. చిరు వ్యాపారస్తులకు జీవనోపాధి అవకాశాలను కల్పించడానికి దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా డిపిఎం వెంకటేష్, టీఎంసీలు చంద్రశేఖర్, శ్రీనివాసరెడ్డి, చిరు వ్యాపారస్తులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor