పాయకరావుపేటలో హోం మంత్రి అనిత బైక్ ర్యాలీ

విశాఖ.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజక వర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్య టించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగా హన కల్పించేందుకు ఎస్. రాయవరం మండలం అడ్డురోడ్డు నుంచి నక్కపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హోంమంత్రి స్వయంగా ద్విచక్ర వాహనంలో హెల్మెట్ ధరించి పాల్గొని, “సురక్షిత రోడ్లు – సురక్షిత జీవితం” అనే నినాదాన్ని ప్రజల్లో కి తీసుకెళ్లారు. వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేస్తూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధన లు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ… ఖరీదైన బైక్‌లు వాడుతున్నప్పటికీ హెల్మెట్ ధరించకపోవడం బాధాకరమన్నారు. ప్రాణం కన్నా ఏదీ ముఖ్యమే మీ కాదని, ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్క రూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. పాయకరావుపేటలో గత నెలలో జరిగి న రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగించా యని, ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాయకులైనా హెల్మెట్ లేకుండా వస్తే డబుల్ ఫైన్ విధించాలని అధికారులకు ఆదేశించారు. “హెల్మెట్ ధరిద్దాం… ప్రాణాలు కాపాడుకుందాం” అంటూ హోం మంత్రి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధి కారులు, కూటమి నేతలు, కార్యకర్తలు, ద్విచక్ర వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor