మోహన్ బాబు గారు మరోసారి వార్తల్లో నిలిచారు. సీనియర్ హీరోయిన్లు జయసుధ, జయప్రదలతో తనకు ఉన్న అనుబంధం గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“జయసుధ గారు నాకు సోదరి వంటి వారు, మా మధ్య ఉన్న బంధం చాలా ప్రత్యేకమైనది. కానీ జయప్రద గారి విషయంలో మాత్రం నాకు అలాంటి సోదరి బంధం లేదు” అంటూ ఆయన వెల్లడించారు. ఈ ఇద్దరు హీరోయిన్లతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మోహన్ బాబు, వారిపై తనకున్న అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు.
