‘జలధార-జలహారతి’ కార్యక్రమంలో భాగంగా నల్లమాడ మండలం కొండిగానిగుట్ట వంకలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఫీడర్ ఛానల్ డీసిల్టింగ్ (పూడికతీత) పనులను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గారు పనుల అంచనా వ్యయం, నీటి మళ్లింపు మార్గాల గురించి అధికారులను ఆరా తీశారు. ఇరిగేషన్ డి.ఇ మరియు ఏ.పి.ఓ లు స్పందిస్తూ.. రూ. 4.99 లక్షల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. కొండిగానిగుట్ట వంక నుండి వచ్చే నీరు కొత్తకుంట మీదుగా రెడ్డిపల్లి చెరువుకు, అక్కడ నుండి మలుకవేముల చెరువుకు చేరుతాయని వివరించారు.అనంతరం కలెక్టర్ గారు మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి చెరువుకు నీరు అందేలా ఉపాధి హామీ పథకం కింద అన్ని ఫీడర్ ఛానల్స్‌కు అంచనాలు సిద్ధం చేసి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డ్వామా పిడి కె. విజయ ప్రసాద్, పుట్టపర్తి క్లస్టర్ ఏపీడి వి. రమేష్ బాబు, తహశీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి , ఎంపీడీవో, ఇరిగేషన్ డి.ఇ మరియు ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొ
