ముదిగుబ్బ యస్ 9
మండల కేంద్రమైన ముదిగుబ్బ లో స్థానిక పాత ఊరిలో 24 గంటల కరెంటు సరఫరా లో భాగంగా గత ఏడాదికాలంగా జరుగుతున్న ప్రత్యేక విద్యుత్ లైన్ పనులను తక్షణమే
పూర్తి చేసి పాత ఊరిలో కరెంటు సరఫరాకి ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ముదిగుబ్బకు మూల స్తంభం లాంటి పాత ఊర్లో ప్రారంభం నుంచి నేటి వరకు కరెంటు సరఫరా మారుమూల గ్రామాల్లో కంటే అద్వానంగా ఉంటూ వస్తోందన్నారు, ముఖ్యంగా వర్షాకాలంలో చిన్నపాటి తుంపెర చినుకులు వచ్చిన విద్యుత్ లైన్లు ట్రిప్ అవుతూ తరచూ కరెంటు సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందన్నారు, వర్షాకాలంలో కరెంటు సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడుతూ రాత్రి వేళల్లో అంధకారం ఏర్పడుతోందని ఆయన ఆవేదన చెందారు, ఈ పరిస్థితుల్లో గత్యంతరం లేక గత ఏడాది పాత ఊరు ప్రజలు తమ కరెంటు సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కరెంట్ ఆఫీస్ ఎదురుగా జాతీయ రహదారిపై రాత్రి 11 గంటల సమయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన దుస్థితి ఏర్పడింది అన్నారు, దీంతో స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు పాత ఊరికి 24 గంటలు కరెంటు సరఫరా చేయు నిమిత్తం పుట్టపర్తి నుంచి పాముదుర్తి సబ్ స్టేషన్ మీదుగా కరెంట్ సరఫరా చేయడంలో భాగంగా ప్రత్యేక విద్యుత్ లైన్ నిర్మాణ పనులు ప్రారంభించారన్నారు, కాగా ఈ పనులు ప్రారంభించి ఏడాది అవుతున్న అధికారుల నిర్లక్ష్యంతో నేటికీ పూర్తి చేయకపోవడంతో పాత ఊరి ప్రజలు తమ కరెంటు సమస్య ఇప్పట్లో తీరుతుందో లేదోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారని శ్రీనివాసులు తెలిపారు, కనుక ఇప్పటికైనా తక్షణమే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి వర్షాకాలం ప్రారంభమై లోపు ఈ విద్యుత్ లైన్ పనులు పూర్తిచేసి పాత ఊరిలో కరెంటు సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు, లేని పక్షంలో త్వరలోనే పాత ఊరి ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమం చేపట్టి తద్వారా ముదిగుబ్బ విద్యుత్ సబ్ స్టేషన్ ను కూడా ముట్టడిస్తామని
ఈ సందర్భంగా సిపిఐ నాయకులు చల్లా శ్రీనివాసులు అధికారులకు తెలియజేశారు,
పాత ఊరిలో విద్యుత్ లైన్ పనులు తక్షణమే పూర్తి చేయాలి….
