శ్రీ సత్య సాయి జిల్లా ,హిందూపురం.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగాయి. పట్టుదలకి, అకుంఠిత దీక్షకు మారుపేరైన భగీరథుని స్మరించుకుంటూ సగర సామాజిక వర్గ నేతలు, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు ఆయన ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొని భగీరథుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
హిందూపురం పట్టణంలో నిర్వహించిన భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో ఆధ్యాత్మిక, సేవా ఉత్సాహం వెల్లివిరిసింది. గంగమ్మను భువికి తెచ్చిన భగీరథుని పట్టుదలను నేటి తరానికి స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
ముఖ్యంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శులు ఈ వేడుకల్లో పాల్గొని, నియోజకవర్గ అభివృద్ధిలోనూ, సామాజిక ఐక్యతలోనూ అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ఉప్పర సగర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మాణిప్రియ మాట్లాడుతూ భగీరథ మహర్షి అందించిన స్ఫూర్తితోనే ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన మరియు టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి పక్షాల మధ్య సమన్వయంతో జరిగిన ఈ వేడుకలు స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించాయి.
బైట్స్ : వీరయ్య ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి
