అనంతపురం జిల్లా, రాయదుర్గం
——————————————
ప్రజా సంక్షేమం ,రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు నిర్విరామంగా శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలందరూ ఆశీర్వదించి అండగా నిలవాలని రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాయకుడా వర్ధిల్లు నిండు నూరేళ్లు ప్రగతి పండుగ వేడుకల్లో భాగంగా డి హిరేహాల్ మండలం కాదలూరు గ్రామంలో రూ. ఆరు కోట్ల తో చేపట్టిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎంపీ బీ.కే. పార్థసారథి, రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత, సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణి లు ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో పసుపు కుంకుమ ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇలా అనేక సంక్షేమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలందరూ చంద్రబాబుకు అండగా నిలవాలని కోరారు. మహిళా సాధికారత చంద్రబాబు తోనే సాధ్యమని పేర్కొన్నారు.మరో 20 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగితే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. చివరకు చంద్రబాబు జన్మదిన పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
బైట్స్. పరిటాల సునీత, రాప్తాడు శాసనసభ్యురాలు
