రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి: ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

అనంతపురం జిల్లా
రాయదుర్గం నియోజకవర్గం•••••

* అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంకు విచ్చేసిన ఆర్ & బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

*అనంతరం రాయదుర్గం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, జేసీ అస్మిత్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి*

*రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి : ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి*

సీమ ప్రజలు ఎంతో నమ్మి జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడితే ఐదేళ్ల పాలనలో సీమకు చేసింది శూన్యం

ఏదో చేస్తాడని నమ్మి ఓటేసిన రాయలసీమ ప్రజలను మోసం చేశారు

సీమలో రాజకీయ నిరుద్యోగులు కూటమిగా ఏర్పడి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు

టిడిపిని రాయలసీమ ద్రోహిగా చిత్రీకరించే కుట్ర జరుగుతుంది

రాయలసీమకు ద్రోహులు ఎవరో ప్రజలకు తెలుసు

ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు రాయలసీమను ఏ విధంగా అభివృద్ధి చేశారనే విషయంపై ఏ వేదిక పైన అయినా చర్చకు సిద్ధం

అసెంబ్లీలో చర్చకి రమ్మంటే జగన్ మోహన్ రెడ్డి పారిపోతున్నారు

వైసిపి ఐదేళ్ల పాలనలో వారికి చెప్పుకోవడానికి కనీసం ఒక్క ప్రాజెక్టు అయినా ఉందా ?

సీమలో జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ ఎస్ఎస్, గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లను తెలుగుదేశం హయాంలో పూర్తి చేసాం

కరువు ప్రాంతమైన సీమకు న్యాయం చేయాలని చంద్రబాబు ఎప్పుడు తపన పడతారు

అవుకు రిజర్వాయర్ ద్వారా పులివెందులకు నీళ్లు ఇచ్చి చీనీ చెట్లను బతికించిన చరిత్ర చంద్రబాబుది

వైసీపీ నేతలు తెరపైకి తెచ్చిన రాయలసీమ లిఫ్టును ఎందుకు అమలు చేయలేకపోయారో సమాధానం చెప్పాలి

కెసిఆర్, హరీష్ రావులు తామే ఆ ప్రాజెక్టును ఆపమని చెప్పుకునే దౌర్భాగ్య దుస్థితి

2014 – 19 మధ్య గోరుకల్లు ప్రాజెక్టు పనులు రూ. 300 కోట్లతో పూర్తి చేసి నీళ్లు నింపిన చరిత్ర మాది

కేవలం కమిషన్ కోసం మట్టి పనులు ప్రారంభించినా చరిత్ర మీది

జిఎన్ఎస్, అవుకు రిజర్వాయర్, ఎస్ ఆర్ బి సి ప్రాజెక్టులను ఎవరు పూర్తి చేశారో చెప్పాలి

2019 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పడితే ఐదేళ్లలో రాయలసీమకు ఏం చేశారో సమాధానం చెప్పాలి

రాయలసీమ నిజమైన ద్రోహి జగన్మోహన్ రెడ్డి.. ఆ విషయం ప్రజలు గ్రహించే 2024 ఎన్నికల్లో కేవలం 7 సీట్లకు పరిమితం చేశారు

రాయలసీమకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులతో సహా ఏ అభివృద్ధి అయినా చంద్రబాబు ద్వారానే సాధ్యం

వైసిపి పోలవరం ప్రాజెక్టును సైతం పక్కన పెట్టింది

*అనంతపురం జిల్లా అభివృద్ధి గురించి…*

నేడు అనంతపురం జిల్లాలో హెచ్ ఎన్ ఎస్ ఎస్ ద్వారా ఎంతో అభివృద్ధి జరుగుతుంది

ముఖ్యంగా హార్టికల్చర్ హబ్ గా రాయలసీమను తీర్చిదిద్దాము

కృష్ణదేవరాయల కాలంనాటి చెరువులను సైతం నేడు నింపుతున్న చరిత్ర మాది

నీరు – చెట్టు ద్వారా నేడు భూగర్భ జలాలు పెంచడానికి కృషి చేస్తున్నాము

గత ఐదేళ్లలో ఏ ఒక్క కాలువ, వాగు, వంకలను కూడా బాగు చేయని దౌర్భాగ్య ప్రభుత్వం వైసిపి

నేడు జలధార – జలహారతి కార్యక్రమం ద్వారా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సాగునీటి కాలువల ఆధునీకరణకు కృషి చేస్తున్నాము

*ఆర్ అండ్ బి శాఖకు మళ్లీ పూర్వ వైభవం..*

గతంలో రాష్ట్రంలో రహదారులను పరిశీలించడానికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చే పరిస్థితి ఉండేది..

గత ఐదేళ్ల పాలనలో ఆర్ అండ్ బి శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు

వైసిపి పాలనలో రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతల మయంగా మారిపోయాయి

కనీసం రోడ్డు మీదకు రావాలంటే ప్రజలు భయాందోళనకు గురయ్యే పరిస్థితి

కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 9 నెలల్లో మిషన్ పాత్ హోల్ పథకం కింద రూ 1060 కోట్లతో రహదారులను గుంతల రహితంగా తీర్చిదిద్దాము

రాష్ట్రంలో మరో రూ. 3 వేల కోట్లతో రహదారులను అభివృద్ధి చేస్తున్నాం

గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో తొలుత పనులు చేపట్టడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి

దీంతో కాంట్రాక్టర్లతో చర్చించి వారిలో నమ్మకం కల్పించి పనులు చేపట్టాము

అనంతపురం జిల్లాలోనే ప్రస్తుతం రూ. 200 కోట్లతో రహదారులను అభివృద్ధి చేస్తున్నాం

రాయదుర్గం నియోజకవర్గంలో రూ. 30 కోట్లతో రహదారులను అభివృద్ధి చేశారు

ఆర్ అండ్ బి శాఖను తిరిగి తలెత్తుకునేలా పూర్వవైభవం తీసుకొచ్చాం

Posted Under AP
Editor