బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు..!

ఫామ్ హౌస్ లో కోడి పందేల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు మాదాపూర్ లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అతికించారు. శుక్రవారం తమ ముందుకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

 

కేసు వివరాల్లోకి వెళితే… గత నెలలో తొల్కట్టలోని ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున కోడిపందేలు, కేసినో నిర్వహించారు. ఆ సమయంలో ఫామ్ హౌస్ పై దాడి చేసిన పోలీసులు మొత్తం 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్ యజమాని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఫామ్ హౌస్ ను లీజుకు ఇచ్చానని పోలీసులకు ఆయన తెలిపారు. ఈ కేసులో ఆయనకు పోలీసులు నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి.

Editor